![]() |
![]() |

బుల్లితెర మీద అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ . ఈ షో ద్వారా ఎంతో మంది బుల్లితెర నటీనటులు ఫేమస్ ఇపోయారు.. సోషల్ మీడియాలో అప్పుడే అడుగు పెట్టి రీల్స్, ఫన్నీ వీడియోస్ చేసే వాళ్లకు మాత్రం ఈ బిగ్ బాస్ చాలా ప్లస్ అయ్యిందనే చెప్పొచ్చు. వాళ్లకు బిగ్ బాస్ లో ఆఫర్స్ రావడం అలాగే మూవీ ఛాన్సెస్ రావడం ఫుల్ ఫేమ్ తెచ్చుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వారిలో అలీ రెజా కూడా ఒకరు. అలీ రైజా బిగ్ బాస్ సీజన్ 3 లో సందడి చేశాడు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అలాంటి అలీ రెజా సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెట్టి సందడి చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా అలాంటి ఒక పోస్ట్ పెట్టి డాన్స్ వేసాడు. "మంచి వైబ్స్‌లో మునిగిపోవడం ఆ క్షణాన్ని ప్రేమించడం చాల ఆనందంగా ఉంటుంది" అంటూ కామెంట్ చేసాడు.
ఈ పిక్ ని చూసిన నెటిజన్స్ ఫుల్ గా కామెంట్స్ చేస్తున్నారు..."దెయ్యాలు తిరిగి టైం ఈ డాన్సులు ఏందన్నా...యానిమల్ 2 లో నటించడానికి ఇప్పటినుంచే ప్లానింగ్ గాని చేస్తున్నావా" అంటే "అన్నా సూపర్..నువ్వు ఇంత సింపుల్ గా డాన్స్ ఎలా చేస్తావ్..నాకు నీ డాన్స్ అంటే అంటే ఇష్టం" అని ఇంకొకరు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఊర్వశి రాయ్ మాత్రం " ఈ సాంగ్ నీకోసమే రాసినట్టున్నారు" అంటూ కామెంట్ చేసింది. ఐతే ఊర్వశి రాయ్, అలీ రెజా, అరవింద్ కృష్ణ కలిసి గతంలో " గ్రే ద స్పై హూ లవ్డ్ మి" అనే మూవీలో నటించారు. ఐతే ఆలీ రెజా అసలు ఆనందానికి కారణం ఏమిటి అంటే ఇవన్నీ కాదు తానూ నందు, అవికా గోర్ తో కలిసి నటించిన మూవీ "వధువు" రేపు అంటే డిసెంబర్ 8 న డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కాబోతోంది. ఇక తన మూవీ ఇలా ఓటిటి వేదిక మీదకు వస్తుండడంతో ఆలీ రెజా ఆనందానికి అంతే లేకుండా పోయింది. అందుకే సమయం చూసుకోకుండా ఇలా డాన్స్ చేస్తూ ఉన్నాడు అనే విషయం అర్థమైపోతుంది.
![]() |
![]() |